అమరావతిలోని నిర్మాణాలకు ఏమేర నిధులు అవసరమవుతాయో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి అమరావతిలోని నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో తెలియచేయాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అమరావతి ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని ఆరా తీశారు. వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించారు. నిధుల సమీకరణకు సంబంధించి ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్థికశాఖ అధికారులతో కలిసి సమావేశమై ప్రణాళిక చేయాలని సూచించారు. హాపీ నెస్ట్ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఏఎంఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై సీఎం జగన్ సమీక్ష - cm jagan review on AMRDA updates
అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఏఎంఆర్డీఏ కమిషనర్ సమీక్షలో పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో జరిగిన, జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చలు చేశారు.

cm jagan review on AMRDA