రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ,వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. కేసులు అధికంగా నమోదవుతోన్న కర్నూలు జిల్లాపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారంటైన్లలో వసతి, మంచి భోజనం అందించాలన్నారు. జిల్లాలో కరోనా సోకిిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి స్పందించారు. ఇలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. కరోనా వైరస్ ఎవరికైనా సోకవచ్చని.. వారిని అంటరానివారిగా చూడడం సరికాదని హితవుపలికారు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలి గానీ వివక్ష కూడదన్నారు.
వ్యవసాయంపై వైరస్ ప్రభావంపై చర్చ
వ్యవసాయం - అనుబంధ రంగాలపై కరోనా ప్రభావం, నివారణ చర్యలపైనా సీఎం జగన్ చర్చించారు. 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను గ్రామ సచివాలయాల్లో బాగా ప్రచారం చేయాలని.. కష్టం ఉందని ఎక్కడ నుంచి రైతులు ఫోన్ చేసి చెప్పినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూపన్లు జారీ చేసి పంటలు కొనుగోలు చేసిన విధానం పట్ల రైతుల్లో సానుకూలత అధికారులు తెలపగా... అన్ని పంటలకూ ఇదే విధానాన్ని వర్తింప చేయాలని అన్నారు. రోజుకు 60 వేల టన్నుల ధాన్యం, 8 వేల టన్నులు మొక్కజొన్న సేకరిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
మత్స్యకారులకు రూ.2 వేలు ఇవ్వాలి