ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PRC Update:ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం భేటీ.. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడంటే? - Tadepalli

CM Jagan on PRC : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎంత మేర ఫిట్​మెంట్ ఇవ్వాలనే విషయమై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా.. వారి డిమాండ్ల పరిష్కార మార్గాలపై సీఎం సమాలోచనలు జరిపారు. రేపో మాపో పీఆర్సీపై ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి.

ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం
ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం

By

Published : Dec 9, 2021, 12:23 PM IST

Updated : Dec 9, 2021, 5:12 PM IST

CM Jagan on PRC: పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న వేళ.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్ధితి దృష్ట్యా.. ఎంత మేర ఫిట్​మెంట్ ఇచ్చేందుకు సాధ్యమవుతుందనే విషయమై సీఎం సమాలోచనలు జరిపారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం మధ్యంతర బృతి ఇస్తుండగా.. ఆపై ఎంత మేర ఫిట్​మెంట్ పెంచితే బడ్జెట్​పై ఎంత భారం పడుతుందనే అంశాలపై అధికారులను సీఎం నివేదిక అడిగారు. ఈ అంశంపై ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎంకు అందజేశారు. వీటితో పాటు ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. సీపీఎస్ రద్దు చేస్తే బడ్జెట్​పై ఎంత భారం పడుతుంది.. ఎంత మేర నిధులు వెచ్చించాల్సి వస్తుంది, ఎలా సర్దుబాటు చేయాలనే విషయంపై అధికారులతో సీఎం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది.

గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను అక్టోబరు​లో పర్మినెంట్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. 1 లక్ష 10 వేల పైగా ఉన్న సచివాలయ ఉద్యోగుల సర్వీసులను పర్మినెంట్ చేసే అంశంపైనా అధికారులతో సీఎం చర్చించినట్లు తెలిసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ, తదితర డిమాండ్లపై సమావేశంలో చర్చించారు. వీటన్నింటిపై తగు కార్యాచరణను రూపొందించినట్లు తెలిసింది. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తాననని ఈనెల 3న తిరుపతిలో ఉద్యోగులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇవాళ్టి సమావేశంలో ఫిట్​మెంట్ ఎంత మేర ఇవ్వాలనే విషయమై సీఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మూడు రోజుల్లోపే పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

"పీఆర్సీపై అధికారులు సీఎంకు నివేదించారు. అధికారుల ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. 3, 4 రోజుల్లో పీఆర్సీపై ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. పీఆర్సీ కోసం ఇంతకాలం ఆగారు..10 రోజులు ఆగలేరా ?. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు 010 పద్దు కింద వేతనాలు కోరుతున్నారు. మార్కెట్ కమిటీ ఉద్యోగులు, పింఛనర్ల వేతనాలకు సీఎం అంగీకారం తెలిపారు. 010 పద్దు కింద వేతనాలు ఇచ్చేందుకు సీఎం అంగీకారించారు."- వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత

ముందుగా పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసి.. ఆపై ఉద్యోగులతో తుది విడత చర్చలు జరిపి వారి సమ్మతితో ప్రకటన చేయటం సాంప్రదాయంగా వస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందా ?..లేక ప్రభుత్వమే నేరుగా ప్రకటన చేస్తుందా ? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని నిర్ణయిస్తే..రేపో, ఎల్లుండో చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఫిట్​మెంట్​పై వారితో చర్చించే అవకాశాలున్నాయి. సీఎం నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలకు అధికారులు తెలియజేసే అవకాశాలున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలను అధికారులు ఒప్పించి అనంతరం ఫిట్​మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇవీచదవండి.

Last Updated : Dec 9, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details