పంటల ప్రణాళిక, ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాం అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏ పంటలు వేయాలన్న దానిపై మ్యాపింగ్ చేయాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. జిల్లా, మండలస్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని చెప్పారు.
ఈ–క్రాపింగ్‌పై మార్గదర్శకాలు, ఎస్‌వోపీలను తయారుచేయాలని సీఎం ఆదేశించారు. సంబందించిన విధివిధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని సూచించారు. రైతుల వద్ద నుంచి 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. మిగతా 70 శాతం పంటలు కూడా అమ్ముడయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాంను వినియోగించుకోవాలని చెప్పారు.