ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JAGAN-CHIRU TWEETS: చిరంజీవి ట్వీట్​పై స్పందించిన జగన్​..ఏమన్నారంటే

అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో.. సీఎం జగన్​ను మెగాస్టార్ చిరు పొగుడుతూనే ఉంటారు. దానిపై ఎవరికీ ఏ అభిప్రాయం ఉన్నా... చిరు అభినందనలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈనెల 21న రాష్ట్రంలో సుమారు 13.72 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా... టీమ్​ ఏపీ, సీఎం జగన్​కు అభినందనలు తెలుపుతూ.. చిరు ట్వీట్ చేశారు. దానికి ముఖ్యమంత్రి రిప్లయ్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అధికారులకే వెళ్తుందని రీట్వీట్ చేశారు.

జగన్ మీరు గ్రేట్... మీ ప్రశంసలకు ధన్యవాదాలు..!
జగన్ మీరు గ్రేట్... మీ ప్రశంసలకు ధన్యవాదాలు..!

By

Published : Jun 23, 2021, 4:14 PM IST

మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వం తరపున, మీ ప్రశంసలకు ధన్యవాదాలు. విలేజ్, వార్డ్ సెక్రటేరియట్స్, వాలంటీర్స్, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ వైద్యులు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జేసీలు, కలెక్టర్లు చేసిన ప్రయత్నానికి మీ క్రెడిట్ దక్కుతుంది' అని జగన్ ట్వీట్ చేశారు.

చిరంజీవి ఏమని ట్వీట్ చేశారంటే...

'ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య బృందాలు ఒకే రోజులో 13.72 లక్షల మందికి టీకాలు వేయడం అద్భుతం. చాలా సంతోషంగా ఉంది. మీ ప్రయత్నాలు కొవిడ్​ను ఓడించడానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతాయి. టీం ఏపీకి మరింత శక్తి రావాలి. ఉత్తేజకరమైన నాయకత్వం ఉన్న జగన్​కు అభినందనలు.' అని కొనియాడారు.

ఇదీ చదవండీ... cm jagan: మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details