ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు ఎంపీపీ (cm jagan resolved mundlamoor mpp issue news) వివాదం కొలిక్కివచ్చింది. తాడేపల్లికి చేరిన ఈ వ్యవహారాన్ని.. ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు వర్గానికే పదవి ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో కూడా దర్శి అసెంబ్లీ సీటు మద్దిశెట్టికే ఇస్తామని స్పష్టం చేశారు.
సీఎం వద్దకు ముండ్లమూరు ఎంపీపీ వివాదం.. ఎమ్మెల్యే వేణు వర్గానికే పదవి - ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు
dispute of darsi mpp
14:56 September 22
dispute of mundlamoor mpp
వేణుతో కలిసి పని చేయాలని బూచేపల్లి శివప్రసాద్కు..సీఎం జగన్ సూచించారు. ఇద్దరు కలిసుంటే నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందన్నారు. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఈ క్రమంలో ముండ్లమూరు ఎంపీపీ ఎన్నికపై ఇరువర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో మంగళవారం సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద మద్దిశెట్టి వర్గం బలప్రదర్శనకు దిగారు.
ఇదీ చదవండి
Last Updated : Sep 22, 2021, 3:37 PM IST