రాష్ట్ర ప్రజలకు సీఎం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - CM jagan Republic Day wishes to the people news
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని... రాజ్యాంగ పీఠిక మొదలు, ప్రాథమిక హక్కులు, అధికారాల విభజన, ప్రత్యేక రక్షణలు వంటి అంశాల్లో అంబేడ్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, జవహార్‌లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, దార్శనికతతో వ్యవహరించారని సీఎం జగన్ కొనియాడారు. అనేక అంశాల్లో 70 ఏళ్లుగా రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, పౌరులకు రక్షణ కవచంగా నిలిచిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : దివంగత జైట్లీ, సుష్మాస్వరాజ్‌కు పద్మవిభూషణ్