వైఎస్ఆర్ బీమా కింద నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
వైఎస్ఆర్ బీమా రూ.254 కోట్లు విడుదల - వైఎస్ఆర్ భీమా నిధులు విడుదల
వైఎస్ఆర్ భీమా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆన్ లైన్ ద్వారా బీమా నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ బీమా కింద 254.72 కోట్ల సొమ్మును బీమా పరిహారంగా చెల్లించారు. 12,039 మంది కుటుంబాలకు బీమా పరిహారం సొమ్మును విడుదల చేశారు. అర్హత ఉండీ బీమా అందనివారు 155214 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు తెలియజేయవచ్చని సీఎం జగన్ తెలిపారు.

సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటుంబానికి తోడుగా నిలబడాలి. అలాంటి కుటుంబానికి తోడుగా నిలబడాలనే వైఎస్‌ఆర్ బీమా పథకం. 12,039 కుటుంబాలకు అర్హత ఉన్నా బీమా రాని పరిస్థితి. బీమా కంపెనీల నుంచి రాకున్నా ప్రభుత్వం ఇచ్చేలా నిర్ణయం. మానవతా దృక్పథంతో 12,039 కుటుంబాలను ఆదుకుంటున్నాం. బీమా పరిహారం చెల్లింపు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. గతేడాది అక్టోబర్ 21న బ్యాంకులకు రూ.510 కోట్లు పూర్తిగా చెల్లించాం. బ్యాంకు ఖాతాలు చేయించాలని ఇప్పుడు నిబంధన పెట్టారు. వాలంటీర్లు కష్టపడి ఇప్పటివరకు 62 లక్షల ఖాతాలు తెరిపించారు. 45 రోజుల్లోపు చనిపోతే ప్రీమియం ఇవ్వబోమని మెలిక పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అందరికీ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని కోరుతున్నా. బీమా పథకానికి కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరుగుతోంది.- ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి:కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన