ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీ పోలీస్‌ సేవ' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్ - ఏపీ పోలీస్‌ సేవ యాప్ ను ప్రారంభించిన సీఎం

'ఏపీ పోలీస్‌ సేవ' యాప్‌‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా సరికొత్త యాప్‌ను రాష్ట్ర పోలీసు శాఖ రూపొందించింది. ఏపీలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్ ను రూపకల్పన చేశారు.

cm jagan released police app
cm jagan released police app

By

Published : Sep 21, 2020, 12:16 PM IST

Updated : Sep 21, 2020, 1:39 PM IST

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సేవ యాప్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా.. సరికొత్తగా రూపొందిన ఈ మొబైల్ అప్లికేషన్​ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్‌ను రూపొందించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండానే ప్రజలకు 87 రకాల సేవలు పోలీస్ సేవ యాప్ ద్వారా అందనున్నాయి. అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు చేయడమే కాక వాటికి రశీదు సైతం ఫిర్యాదుదారుడికి అందేలా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 'ఏపీ పోలీస్ సేవ'‌.. ఎలా పని చేస్తుందన్నది అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

'ఏపీ పోలీస్‌ సేవ' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్

పోలీసులను ఓ బలగంగా, ఓ ఫోర్సుగా కాకుండా సేవలందించేవారిగా సమాజం చూసినప్పుడే సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే అర్థం వస్తుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ప్రజల ఇళ్ల భద్రత సహా అనేక సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చన్నారు.

ఏపీ పోలీసు సేవ యాప్ ద్వారానే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని.. ఫిర్యాదు చేసినపుడు యాప్ ద్వారా రసీదు వస్తుందని.. ఎఫ్ ఐఆర్ నమోదు నుంచి ఆ కేసుపై తదుపరి చర్యలను ఫిర్యాదు దారుడికిమొబైల్ సందేశాల ద్వారా అందిస్తాంమన్నారు. మహిళల భద్రతకు,వారి ఫిర్యాదుల పరిష్కారానికి యాప్ లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలు జరిగినపడు ఆపత్కాల సేవలందించే ఏర్పాట్లు యాప్ లో ఉన్నాయని వివరించారు. సైబర్ నేరాల పై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా యాప్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఈ అప్లికేషన్ తో అనుసంధానం చేశామని తెలిపారు.

'ఏపీ పోలీస్‌ సేవ' యాప్‌‌ను ఆవిష్కరించిన సీఎం జగన్

2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో మహిళా పోలీసును నియమించాం. పోలీసు సేవలను ప్రతి గ్రామానికి విస్తరించాం. గ్రామ సచివాలయం స్థాయిలోని మహిళా పోలీసుకు యాప్ ద్వారా అనుసంధానం చేశాం. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ యాప్ కు విశేష ఆదరణ వచ్చింది. 117 ఎఫ్ ఐ ఆర్ లు దిశ యాక్ట్ ద్వారా నమోదు చేశాం. టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారు. ప్రజలకోసమే పోలీసు వ్యవస్థ ఉంది. నేరాలని విచారించడం, శాంతి భద్రతల పరి రక్షణ కోసం పోలీసులు పనిచేయాలి. సమాజంలో నేరాలు సున్నా శాతానికి తీసుకు వచ్చేందుకే పోలీసు వ్యవస్ధ ఉంది. పోలీసు శాఖను వీలైనంత పారదర్శకంగా వ్యవస్థను మార్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సామాన్యుడుకి మేలు చేయడమే లక్ష్యంగా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇకపై ఏపీ పోలీసు సేవ మొబైల్ యాప్ నుంచే ప్రజలు పోలీసులు ఫిర్యాదు చేయవచ్చు.- ముఖ్యమంత్రి జగన్

పోలీస్ స్టేషన్​కు రాకుండానే యాప్ ద్వారా 87 రకాల సేవలు : హోంమంత్రి సుచరిత

మహిళల భద్రత కోసం దిశ చట్టం, యాప్‌ తీసుకొచ్చామని హోంమంత్రి సుచరిత అన్నారు. పోలీస్‌స్టేషన్‌కు రాకుండానే 87 రకాల సేవలను యాప్ ద్వారా పొందవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏపీ పోలీసు శాఖ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 36 అవార్డులు సాధించిందని పేర్కొన్నారు. నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు ఐఎస్‌వో మార్కు వచ్చిందన్న హోంమంత్రి.. నేరాల సంఖ్య తగ్గించేలా పోలీసు విభాగం పనిచేయాలని కోరారు.

ఇదీ చదవండి:

భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి.. మోదీ విచారం

Last Updated : Sep 21, 2020, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details