రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2022 వరకూ భర్తీ చేసే 10వేల 143 ఉద్యోగాల వివరాలతో సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అవినీతి, పక్షపాతం, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ ఉండనుందన్నారు. కేవలం మెరిట్ ఆధారంగానే భర్తీ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఎన్నో ఏళ్లుగా అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారని.. వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు భర్తీ చేపడుతున్నామని వెల్లడించారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేస్తామని.. ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
GOOD NEWS: 10,143 ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల - ఏపీలో బాబ్ క్యాలెండర్
రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలిపారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను సీఎం జగన్ విడుదల చేశారు. 10,143 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.

ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్ తెస్తున్నామని సీఎం జగన్ అన్నారు. గ్రామ సచివాలయాల్లో 1.22 లక్షల శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశామని హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతలో సేవాభావం పెంచేందుకు వాలంటీర్ వ్యవస్థ తెచ్చామని.. 2.50 లక్షలపైన నిరుద్యోగులను వాలంటీర్లుగా నియమించామని సీఎం పేర్కొన్నారు. రెండేళ్లలోనే ఏకంగా 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేయగలిగామని సీఎం చెప్పారు. 1,84,264 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చామన్నారు. 3,99,791 పొరుగుసేవలు, 19,701 ఒప్పంద ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మూడున్నర వేల కోట్ల రూపాయలు భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి... 51,387 మంది సిబ్బందికి ఉద్యోగ భద్రతను ఇచ్చామని సీఎం గుర్తుచేశారు.
ఇదీ చదవండి: