ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు - ప్రపంచ పులుల దినోత్సవం

రాష్ట్రంలో పులుల సంరక్షణకు అటవీశాఖ చేపడుతున్న చర్యలను సీఎం జగన్ అభినందించారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ రూపొందించిన బ్రోచర్ ను విడుదల చేశారు.

world tiger day
world tiger day

By

Published : Jul 29, 2020, 3:26 PM IST

అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించడానికి అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక కృషిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ రూపొందించిన పోస్టర్స్, బ్రోచర్ ను‌ సీఎం విడుదల చేశారు.

పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను సీఎంకు అటవీశాఖ అధికారులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నా.. రాష్ట్రంలో పెరుగుతున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్ట్ దేశంలోనే అతిపెద్దదిగా ఉందని..ఈ ప్రాంతంలో 60 పులులు ఉన్నాయని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details