2019 ఖరీఫ్‌లో తీసుకున్న పంట రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ పథకం కింద 14.58 లక్షల మంది రైతులకు రూ.510.32 కోట్లు, గత నెలలో వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టానికి పెట్టుబడి రాయితీగా రూ.132 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. పంటనష్టం జరిగిన సీజన్లోనే.. పెట్టుబడి రాయితీ అందించాలనే సీఎం జగన్ నిర్ణయం మేరకు .. అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధమయ్యాయి. వాటి ఆధారంగా కేవలం నెల రోజుల్లోనే పెట్టుబడి రాయితీ చెల్లించడం విశేషం. ఈ-పంట సమాచారం ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడంతో పాటు నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించే చిన్న, సన్న కారు రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు సున్నా వడ్డీ రాయితీ అందించేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంది. సామాజిక తనిఖీల కోసం లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. 'గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లను కూడా రైతుల ఖాతాల్లో వేస్తూ వస్తున్నాం' అని వివరించింది.
నేడు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ సొమ్ము - రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల తాజా వార్తలు
సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ పథకాల కింద రైతులకు రూ.642.32 కోట్లు చెల్లించబోతున్నారు. మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మీట నొక్కి నిధుల్ని విడుదల చేస్తారు.
నేడు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ సొమ్ము