వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.34వేల కోట్లతో మౌలిక వసతులను కల్పించడం ఒక కల అని, దానిని నిజం చేయాలని తాను తపిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నా కల మీ అందరి కల కావాలి. మనందరి కల పేదల కల కావాలి. అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుంది’ అని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహ నిర్మాణంపై సీఎం జగన్ గురువారం సమీక్షించారు.
'గతంలో రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత భారీ మొత్తంలో వెచ్చించిన దాఖలాల్లేవు. ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎవరూ చేయలేదు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను అందించాలన్నదే మన లక్ష్యం. దేశం మొత్తం మనవైపు చూస్తోంది. పేదల కోసం నిర్మిస్తున్న కాలనీలను ఉత్తమ ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం యంత్రాంగమంతా సంకల్పంతో, అంకితభావంతో శ్రమించాలి. అప్పుడే లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతాం.' అని సీఎం పేర్కొన్నారు.
రవాణా ఛార్జీలు పెరగకూడదు