ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సచివాలయాలు మరింత మెరుగ్గా పని చేయాలి' - సచివాలయాల పని తీరుపై సీఎం జగన్

గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా పని చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ విధులు నిర్వహించాలని సీఎం జగన్​ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

cm jagan reivew on gram, ward sachivaly' s working
సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష

By

Published : Dec 23, 2020, 5:57 PM IST

Updated : Dec 23, 2020, 6:29 PM IST

గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభిస్తున్న దృష్ట్యా.. సబ్‌ రిజిస్ట్రార్‌ అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన విధంగా సన్నాహాలు చేయాలని అధికారులకు నిర్ధేశించారు. గ్రామ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందించేదుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్​లకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. శిక్షణ పూర్తైన తర్వాత శాఖాపరమైన పరీక్ష నిర్వహించాలని, ఇందులో అర్హత పొందితేనే వారికి ప్రొబేషనరీ పిరియడ్‌ పూర్తవుతుందన్నారు. దీనికోసం ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహించేలా చూడాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల ప్రగతిపై చర్చించిన సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది పనితీరుపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 1902 నెంబర్​ను కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజల సమస్యలు, గ్రీవెన్స్‌ తెలియజేయడం సహా సచివాలయాల సిబ్బంది పనితీరుపై ఫీడ్‌ బ్యాక్​ తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్‌ కమిటీలు ఉన్నందున వాటితో సమన్వయం చేసుకునేందుకు గ్రామ స్థాయి వ్యవసాయ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు.

ఇదీ చదవండి: ఆన..పర్తి రాజకీయం.. సత్యప్రమాణాలతో గరం గరం

Last Updated : Dec 23, 2020, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details