కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరూ అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని మోదీ వినడం లేదంటూ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేయగా జగన్ స్పందించారు. ఇది కొవిడ్‌పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదన్నారు. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్ సోరెన్‌కు జగన్ సూచించారు.
కరోనా విజృంభిస్తున్న వేళ తగినంత ఆక్సిజన్‌తోపాటు టీకాలు సరఫరా చేయడం లేదంటూ.. చాలా మంది సీఎంలు బహిరంగంగానే కేంద్రాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. దానికి బదులిచ్చారు.