ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో "హర్‌ఘర్‌ తిరంగా".. ఇంటింటా జాతీయ జెండా

HAR GHAR TIRANGA: రాష్ట్రంలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆదేశించారు. కోటి 62 లక్షల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయాలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

HAR GHAR TIRANGA
HAR GHAR TIRANGA

By

Published : Jul 18, 2022, 8:36 AM IST

HAR GHAR TIRANGA: ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌లో భాగంగా ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’కార్యక్రమంపై ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ …హర్‌ ఘర్‌ తిరంగాను ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్రంలో నిర్వహిస్తామని అమిత్ షాకు సీఎం స్పష్టం చేశారు. పౌరుల్లో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు వివరించారు. బహుముఖ ప్రచారం ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామన్నారు. పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించామని.. సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించామన్నారు. సైకిల్‌ ర్యాలీలు నిర్వహించడం సహా పలు కథనాలు ప్రచురించామన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఇతర సంస్ధలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేసేలా ప్రజలను చైతన్యపరిచామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సీఎస్​ఆర్​ కార్యక్రమంలో భాగంగా సంస్థలు వారి ఉద్యోగులకు జాతీయ జెండాను పంపిణీ చేయాలని నిర్ధేశించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు , ఉద్యోగులు వారి నివాసాల వద్ద జెండా ఆవిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు, 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నట్లు సీఎం తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు వారి కార్యాలయాల్లో జెండాను ఎగురవేస్తారని వెల్లడించారు. 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని సీఎం వివరించారు. 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, సముదాయానికి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details