ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: సీఎం జగన్ - cm jagan latest news

బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని ట్వీట్ చేశారు.

cm jgan tributes
cm jgan tributes

By

Published : Jul 6, 2021, 6:05 PM IST

స్వాత్రంత్య సమరయోధుడు, తొలి దళిత ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని.. ఆచరణీయమని జగన్ ట్వీట్ చేశారు.

వైకాపా కార్యాలయంలో...

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల మాట్లాడుతూ.. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌ రామ్‌ల స్ఫూర్తితో సీఎం జగన్ పాలన కొనసాగుతోందని చెప్పారు.

ఇదీ చదవండి:

water disputes: 'ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో.. భద్రత ఏర్పాటు చేయండి'

ABOUT THE AUTHOR

...view details