లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలను విడిచిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. 100 రూపాయల జరిమానాతో సరిపెట్టాలని సీఎం సూచించారు. మళ్లీ నిబంధనల్ని ఉల్లంఘించబోమంటూ వారి నుంచి హామీ పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. వాహనాలు అప్పగించే సమయంలో కొవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలు వదిలిపెట్టండి: సీఎం - లాక్డౌన్ సీజ్ వాహనాల తాజా వార్తలు
లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలను విడిచిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులను ఆదేశించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించినందుకు స్వాధీనం చేసుకున్న వాహనాలన్నీ ఎవరివి వారికి అప్పగించాలని సూచించారు.
cm jagan on seized vehicles in lock down