ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాడు-నేడు పనుల ప్రగతిపై సీఎం అసంతృప్తి..? - nadu nedu in ap

పిల్లలకు ఇచ్చే ఏకరూప దుస్తులు, స్కూలు బ్యాగులు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పిల్లలకు ఇవ్వనున్న ఏకరూప దుస్తులు, బ్యాగులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన నాడు-నేడు పనుల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. ప్రస్తుతం తల్లిదండ్రుల కమిటీలతో నిర్వహిస్తున్న ఈ పనులను ఉపాధిహామీ పథకం పనుల తరహాలో ఏజెన్సీలకు అప్పగించనున్నారు.

cm jagan on nadu nedu
సీఎం జగన్

By

Published : Apr 26, 2020, 7:12 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’పనులు జూన్‌కల్లా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు.‘నాడు-నేడు’ పనులపై తన క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం సమీక్షించారు. పిల్లలకు ఇచ్చే ఏకరూప దుస్తులు, స్కూలు బ్యాగులు నాణ్యంగా ఉండాలని సూచించారు. పిల్లలకు ఇవ్వనున్న ఏకరూప దుస్తులు, బ్యాగులను పరిశీలించారు.

పాఠశాలలకు సరఫరా చేయనున్న ఫర్నీచర్‌, చాక్‌బోర్డు టెండర్లు దాదాపుగా పూర్తయ్యాయని, మిగిలిన ఒకటి, రెండు అంశాలకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 72,596 గ్రీన్‌చాక్‌ బోర్డుల కోసం నిర్వహించిన రివర్స్‌ టెండర్లలో రూ.5.07కోట్లు ఆదా అయ్యాయని, ఎల్‌-1గా నిలిచిన గుత్తేదారు రూ.79.84కోట్లకు కోట్‌ చేస్తే రివర్స్‌ టెండర్లలో రూ.74.77కోట్లకు ఖరారైందని వెల్లడించారు. 16,334 అల్మారాల కోసం ఎల్‌-1 రూ.19.58కోట్లకు కోట్‌ చేస్తే రివర్స్‌ టెండర్లలో రూ.15.35కోట్లకు ఖరారైందని వెల్లడించారు.

‘నాడు-నేడు పనుల్లో మార్పు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. ప్రస్తుతం తల్లిదండ్రుల కమిటీలతో నిర్వహిస్తున్న ఈ పనులను ఉపాధిహామీ పథకం పనుల తరహాలో ఏజెన్సీలకు అప్పగించనున్నారు. పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాడు-నేడు’ పనులపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో పనుల ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పనులు చేసే ఏజెన్సీతో తల్లిదండ్రుల కమిటీ, ఇంజినీరింగ్‌ విభాగం ఒప్పందం కుదుర్చుకుంటాయి. పనులను తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షిస్తుంది. పనులకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించినందున కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండీ... తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు

ABOUT THE AUTHOR

...view details