ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagananna Chedodu Scheme Funds : చేతివృత్తులవారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయి.. - సీఎం జగన్ - జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులు

CM Jagan on Jagananna Chedodu Scheme : జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. స్వయం సహాయ కేటగిరీలో ఎక్కువగా చేతివృత్తులపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. చేతివృత్తుల పనివారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Jagananna Chedodu Scheme Funds
సీఎం జగన్

By

Published : Feb 8, 2022, 12:48 PM IST

చేతివృత్తులవారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి -సీఎం జగన్

CM Jagan on Jagananna Chedodu Scheme : జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. స్వయం సహాయ కేటగిరీలో ఎక్కువగా చేతివృత్తులపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. చేతివృత్తుల పనివారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితని ముఖ్యమంత్రి తెలిపారు.

"స్వయం సహాయ కేటగిరీలో ఎక్కువగా చేతివృత్తులపైనే ఆధారపడ్డాయి. చేతివృత్తుల పనివారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి. వృత్తిపరంగా రజక, నాయీబ్రాహ్మణుల సేవలు అమూల్యమైనవి. ఏటా రూ.10 వేలు సాయం చేస్తూ అండగా నిలబడుతున్నాం. 2.85 లక్షల మందికి నేరుగా ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. 1.46 లక్షల మంది దర్జీల ఖాతాల్లో రూ.146 కోట్లు జమ చేస్తున్నాం. 98,439 మంది రజకుల ఖాతాల్లో రూ.98.44 కోట్లు జమ చేయనున్నాం. 40,808 మంది నాయీబ్రాహ్మణుల ఖాతాల్లో రూ.40.81 కోట్లు జమ చేయబోతున్నాం. అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నాం. గ్రామవార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నాం. రెండేళ్లలో నాయీబ్రాహ్మణ, రజక, దర్జీలకు రూ.583.78 కోట్లు ఇచ్చాం. చేతివృత్తుల వారు అన్ని రకాలుగా ఎదగాలని తపించాం. మత్స్యకార భరోసా, నేతన్న నేస్తంతో వారికి అండగా నిలిచాం. నవరత్నాల పథకంతో ప్రతి అడుగులో తోడుగా నిలబడ్డాం. "-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

ఇదీ చదవండి :'ఏపీలో రెవెన్యూ లోటు.. బడ్జెట్‌ అంచనాలకంటే అధికం'

ABOUT THE AUTHOR

...view details