ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది... ఎవరూ ఆపలేరు - ముఖ్యమంత్రి జగన్ తాజా వార్తలు

కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని... దీన్ని ఎవరూ ఆపలేమని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. వచ్చినప్పుడు వెంటనే పరీక్షలు చేయించుకొని మందులు వేసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు.

cm jagan on corona pandamic
కరోనా గురించి సీఎం జగన్ వివరణ

By

Published : Jul 16, 2020, 1:38 PM IST

వ్యాక్సిన్ వచ్చే వరకు కొవిడ్​తో కలిసి జీవించాల్సిందేనన్న ముఖ్యమంత్రి జగన్... నివారణ చర్యల పట్ల కలెక్టర్లు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, ఎవరూ ఆపలేమని అభిప్రాయపడ్డారు. వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి... ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలన్నారు. కొవిడ్​ రాగానే వెంటనే మందులు తీసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు.

ఇళ్లల్లో ప్రత్యేక గది లేకపోతే కొవిడ్​ కేర్​ సెంటర్​లో ఉండొచ్చన్నారు. 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ నయం చేసుకుంటున్నారని.. 15 శాతమే ఆసుపత్రులకు వస్తున్నారని వివరించారు. అందులోనూ 4 శాతం మంది మాత్రమే ఐసీయూలో ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్ర సరిహద్దులు తెరిచినందున రాకపోకలు పెరిగాయని..., అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు వస్తున్నారని అలాంటి వారందరికీ వెంటనే పరీక్షలు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details