సీఎం జగన్ రెండురోజుల దిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో దాదాపు 45 నిమిషాల పాటు జగన్ భేటీ అయ్యారు. హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్రమంత్రితో భేటీ తర్వాత దిల్లీ విమానాశ్రయానికి బయల్దేరారు. కాసేపట్లో సీఎం జగన్ దిల్లీ నుంచి గన్నవరం బయల్దేరి రానున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించారు. కేంద్ర సాయంపై చర్చించారు.
ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన - కేంద్రమంత్రులను కలిసిన సీఎం జగన్ న్యూస్
ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర న్యాయశాఖమంత్రిని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు.
cm jagan met central minister ravishankara prasad
Last Updated : Feb 15, 2020, 1:24 PM IST