2021–22 వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. మొత్తం 2 లక్షల 83వేల 380 కోట్లుగా రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి లక్షా 48వేల 500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. మొత్తం వార్షిక రుణాల్లో వ్యవసాయరంగం వాటా 54 శాతంగా ఉంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితితో సీఎం జగన్ సమావేశమయ్యారు.
రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా అధికంగానే చేపట్టామని సీఎం అన్నారు. కొన్ని అంశాల్లో బ్యాంకుల(Bank) సమర్థత పెరగాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 17వేల కొత్త కాలనీల్లో మౌలిక సదుపాయల కల్పనకు బ్యాంకులు సహకరించాలని సీఎం కోరారు. కౌలు రైతులకు రుణాలపై దృష్టి సారించాలన్నారు. కౌలు రైతులను బ్యాంకులు(Bank) ఆదుకోవాలని కోరారు.