పర్యాటక, యువజన సర్వీసులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపులో జాప్యంపై సీఎం ప్రస్తావించారు. తెలంగాణలోని బాధిత కుటుంబాల నుంచి ధ్రువపత్రాలు రావట్లేదని అధికారులు తెలిపారు. పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఇదే సమావేశంలో.. పర్యటకం, క్రీడలు, యువత, శిల్పారామం అంశాలపై చర్చించినట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 15 పర్యాటక ప్రదేశాల్లో ప్రపంచస్థాయి హోటళ్లు వచ్చేలా చర్యలకు సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. నదిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి... బోట్లకు అనుమతి, ఫిట్‌నెస్ చూశాక ఇక్కడి నుంచే ఇస్తామని మంత్రి తెలిపారు. నదిలో బోట్ రవాణాపై త్వరలో కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి అవంతి - cm jagan meet with tourism department
పర్యటక, యువజన సర్వీసులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బోటు ప్రమాద బాధితులకు పరిహారం వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. క్రీడలు, మైదానాల ప్రతిపాదన, భాష, సంస్కృతి వంటి వాటిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి తెలిపారు.
విశాఖ, విజయవాడ, తిరుపతిలో మైదానాల ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు మంత్రి అవంతి పేర్కొన్నారు. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని మంత్రి చెప్పారు. మండల, నియోజకవర్గస్థాయి మైదానం అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారు. కొండపల్లి పోర్ట్, గాంధీ మ్యూజియం పూర్తి చేయాలని సీఎం చెప్పినట్లు మంత్రి అవంతి తెలిపారు. ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
భాష, సంస్కృతి అభివృద్ధికి కృషి చేయాలని సీఎం చెప్పినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సంస్కృతి వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సాహిస్తామన్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో ఉపాధి అవకాశాలు కల్పించటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కోటితో శిల్పారామాలకు మరమ్మతులు, అభివృద్ధి చేయనున్నట్లు అవంతి వెల్లడించారు. ఇడుపులపాయలోనూ శిల్పారామం నిర్మించనున్నట్లు పర్యాటక మంత్రి స్పష్టం చేశారు.
TAGGED:
ap tourism