ఏడాది కాలంగా ముఖ్యమంత్రి జగన్‌ను కలవాలని అనుకున్నామని...ఇప్పుడు కలిసి తమ సంతోషాన్ని తెలియజేశామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
సినిమాల చిత్రీకరణకు సీఎం జగన్ అంగీకరించారని చిరంజీవి చెప్పారు. నంది పురస్కారాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఉండాలని కోరగా... 2019-20 సంవత్సరాలకు నంది అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. థియేటర్ల టికెట్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని.. అదే విధంగా సినిమా టికెట్ల జారీలో పారదర్శకత ఉండాలని కోరినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సినీపరిశ్రమ కట్టుబడి ఉందని చిరంజీవి అన్నారు.