ఉద్యోగ నియామక క్యాలెండర్ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 13న ఉగాది పండుగ రోజు ఏపీపీఎస్సీ క్యాలెండర్‌పై సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ శాఖలలో ఉన్న ఖాళీలపై సీఎస్ అదిత్యనాథ్ దాస్ కీలక సమీక్ష నిర్వహించారు. వివిధ కీలక శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలపై వివరాలు తీసుకున్నారు. సీఎం ప్రకటన తరువాత వివిధ ఉద్యోగ నియామకాలకు విడివిడిగా నోటిఫికేషన్లను ఎపీపీఎస్సీ జారీ చేయనుంది.
ఉగాది రోజున ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం! - సీఎస్ అదిత్యనాథ్ దాస్ తాజా వార్తలు
ఉగాది పండుగ రోజున ఏపీపీఎస్సీ క్యాలెండర్‌పై సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఉద్యోగ నియామక క్యాలెండర్ ప్రకటనపై ఉన్నతాధికారులతో సీఎస్ అదిత్యనాథ్ దాస్ కీలక సమీక్ష నిర్వహించారు.
ఏపీపీఎస్సీ క్యాలెండర్
సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టాక గ్రామ, వార్డు సచివాలయలలో సుమారు లక్షా 20 వేల ఉద్యోగస్థులను నియమించారు. అలానే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 2,331 కరోనా కేసులు నమోదు.. 11 మంది మృతి