ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan letter to PM: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖలు - సీఎం జగన్ లేఖ

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖలు
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖలు

By

Published : Nov 24, 2021, 11:18 AM IST

Updated : Nov 24, 2021, 12:30 PM IST

11:12 November 24

తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలి: సీఎం

హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని, తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలన్నారు. 4 జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం అధిక వర్షపాతం నమోదైందని, చాలాచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని లేఖలో పేర్కొన్నారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట ప్రాంతాలు భారీవర్షాలకు నీటమునిగాయని, గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని తెలిపారు. 

196 మండలాలు నీటమునగగా, 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రోడ్లు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయని వివరించారు. 

ఇదీ చదవండి:

వరద బాధితులకు అండగా ఉంటామన్న చంద్రబాబు.. నేడు చిత్తూరులో పర్యటన

Last Updated : Nov 24, 2021, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details