ముఖ్యమంత్రి జగన్ దిల్లీ బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం బయలుదేరిన ఆయన ప్రత్యేక విమానంలో హస్తిన పర్యటనకు వెళ్లారు. ఇవాళ రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీపై పలువురి పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వెంట వెళ్లిన వారిలో ఎంపీలు మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్, ఇతర ఉన్నతాధికారులు, హైకోర్టులో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ జాస్తి నాగభూషణ్ ఉన్నారు.
దిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ - ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాజా వార్తలు
సీఎం జగన్ ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్దేరారు. ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.
cm jagan delhi tour
Last Updated : Jan 19, 2021, 4:07 PM IST