కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని జీరో పాయింట్ వద్ద పైలాన్ ఆవిష్కరించి ప్రనులకు శ్రీకారం చుట్టారు. కరకట్ట రహదారి విస్తరణ ప్రాజెక్టు శిలాఫలకం ఆవిష్కరించారు.
ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నుంచి రాయపూడి వరకు 15 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి కావాల్సిన రూ.150 కోట్ల నిధులను అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబిలిటీ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సమకూరుస్తోంది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పనులను చేపట్టనుంది. విస్తరణలో భాగంగా పాదచారులు నడిచేందుకు వీలుగా రెండు వైపులా ఒకటిన్నర మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేయనున్నారు. 15 కి.మీ. పొడవున, 10 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి ప్రణాళికలు చేపట్టారు.