ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి: సీఎం - latest updates of nadu neadu

ఆరోగ్య రంగంలో 'నాడు- నేడు'తో పాటు వైఎస్​ఆర్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని కర్నూలులో ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

cm jagan launching nadu neadu in kurnool district
cm jagan launching nadu neadu in kurnool district

By

Published : Feb 18, 2020, 1:49 PM IST

Updated : Feb 18, 2020, 2:33 PM IST

బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం జగన్

నాడు- నేడుతో పాటు వైఎస్​ఆర్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ కర్నూలులో లాంఛనంగా ప్రారంభించారు. రెండు ముఖ్యమైన పథకాలకు కర్నూలు వేదికగా శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని అన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం సీఎం ప్రసంగించారు.

మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆరోగ్య రంగంలో 'నాడు-నేడు'కు ఇక్కడి నుంచే శ్రీకారం చూడుతున్నామని చెప్పారు. అవసరమైన చోట కొత్త ఆస్పత్రులను నిర్మిస్తామని వెల్లడించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా రూ.15,337 కోట్లతో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రతి లోక్​సభ నియోజకవర్గంలో ఒక బోధనాస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే వైద్యులు లేరనే మాట వినిపించకూడదని అన్నారు. మార్చి 1 నుంచి అవ్వ, తాతలకు కంటి ఆపరేషన్లు జరుగుతాయని వెల్లడించారు. కంటి పరీక్షలు చేసి ఇంటివద్దే కళ్ల జోళ్లు అందిస్తామని తెలిపారు.

తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలను.. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ఇదీ చదవండి:

కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు

Last Updated : Feb 18, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details