ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JAGANNANNA PALAVELLUVA: అమూల్ ఒక కంపెనీ కాదు.. పాలు పోసేవాళ్లే యజమానులు: సీఎం జగన్​

JAGANNANNA PALAVELLUVA: జగనన్న పాలవెల్లువ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చవల్​గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..పాల నుంచి చాక్లెట్ తయారు చేసే వ్యవస్థ అమూల్​కు ఉందన్న ఆయన..లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప సంస్థ అని స్పష్టం చేశారు.

సీఎం జగన్
సీఎం జగన్

By

Published : Dec 29, 2021, 12:30 PM IST

Updated : Dec 29, 2021, 12:52 PM IST

JAGANNANNA PALAVELLUVA: జగనన్న పాలవెల్లువ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చవల్​గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో పాలవెల్లువ కొనసాగనుందని వెల్లడించారు. ఏపీ పాలవెల్లువ ద్వారా రైతులకు మెరుగైన ధర లభిస్తుందన్న జగన్.. అమూల్ ఒక కంపెనీ కాదని, పాలు పోసేవాళ్లే యాజమానులని స్పష్టం చేశారు.

అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే పాల సేకరణ చేస్తోందని.. ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాలసేకరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పాలవెల్లువ ఇవాళ ఆరో జిల్లా కృష్ణాలోకి ప్రవేశిస్తోందన్న ముఖ్యమంత్రి.. మహిళ సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాల నుంచి చాక్లెట్ తయారు చేసే వ్యవస్థ అమూల్​కు ఉందని..ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఈ సంస్థ ఉన్నట్లు చెప్పారు. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప సంస్థ అమూల్.. అని సీఎం వివరించారు.

ఇదీ చదవండి:

Against MLA Baburao: ఎమ్మెల్యే బాబూరావుపై సొంత పార్టీ కార్యకర్తల తిరుగుబావుటా!

Last Updated : Dec 29, 2021, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details