కార్మికశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కార్మికుల సంక్షేమం, వారికి అందే వైద్య సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవకతవకలపై చర్చించగా... మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కూడా కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని, అవినీతిని ఏరిపారేయాలని సీఎం స్పష్టం చేశారు. మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలని, కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలన్నారు. బీమా రూపంలో ఎల్‌ఐసీ బకాయిల చెల్లింపునకు ప్రధానికి లేఖ రాస్తామని జగన్ తెలిపారు. ఇప్పుడున్న టీచింగ్ ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నట్లు జగన్ తెలిపారు. కాలుష్యం బారిన పడకుండా చూసుకుంటే రాష్ట్రానికి మేలు చేసినట్టేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదిలేస్తున్నారని.. ఆ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం, భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయని అన్నారు.
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి: సీఎం
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కార్మికశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కార్మికుల సంక్షేమం, వైద్య సౌకర్యాలపై అధికారులతో ఆరా తీశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవకతవకలపై సీఎం అధికారులను ప్రశ్నించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలన్నారు.
cm