కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు ఆహారం, నీరు అందిచాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 50 కి.మీ దూరంలో ఆహారం అందేలా ఏర్పాటు చేయాలని అన్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్తున్న వారిని గుర్తించాలని సూచించారు. స్వస్థలాలకు చేర్చేందుకు రవాణా ఏర్పాట్లు కూడా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కార్మికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఇప్పటివరకు ఏపీ నుంచి 22వేల మంది వలస కార్మికులు వెళ్లారని సీఎం జగన్ తెలిపారు.
కాలినడకన వెళ్తున్న వారికి ఆహారం, నీరు అందించండి: సీఎం జగన్ - cm jagan news
వలస కార్మికుల విషయంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలి నడకన వెళ్తున్న వారికి ఆహారం, నీరు అందించాలని స్పష్టం చేశారు.

cm jagan