వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారభించారు. ఈ పథకం ద్వారా చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. కుటుంబానికి రూ.10వేలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. రాష్ట్రంలోని 10లక్షలకు పైగా మత్స్యకార కుటుంబాలకు ఆర్థికసాయం అందనుంది. కార్యక్రమం ప్రారంభించాక.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు 'లిక్కర్ ఎన్‌ఫోర్స్‌మెంట్'పై ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు.
మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ - మత్స్యకార భరోసా తాజా వార్తలు
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు.
మత్స్యకార భరోసా పథకం ప్రారంభించనున్న సీఎం
Last Updated : May 6, 2020, 2:23 PM IST