విపత్తు తక్షణ స్పందన దళం వాహనాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి కార్యాలయం నుంచి దూరదృశ్య మాద్యమం ద్వారా సీఎం జెండా ఊపి ఆ వాహనాలను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ వాహనాలు ఎంతో తోడ్పడతాయన్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మరింతగా బలపరిచేలా.. వారి సమర్థతను మరింతంగా పెంచుతాయన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన సామగ్రి, పరికరాలు ఈ వాహనాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. 14 తక్షణ స్పందన దళం వాహనాలతోపాటు మరో 36 ఎమర్జెన్సీ రెస్సాన్స్ వాహనాలను కూడా పోలీస్‌శాఖకు అప్పగిస్తున్నామని సీఎం వివరించారు. ఘటనా స్థలంలో ఏం జరుగుతుందో నేరుగా కంట్రోల్ రూంలో చూసే అవకాశం ఉంటుందని తెలిపారు.
'విపత్తు తక్షణ స్పందన దళం' వాహనాలను ప్రారంభించిన సీఎం - ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు వార్తలు
విపత్తు తక్షణ స్పందన దళ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా వాహనాల్లో ప్రత్యేక పరికరాలు ఉన్నట్లు జగన్ వివరించారు.
విపత్తు తక్షణ స్పందన దళం వాహనాలను ప్రారంభించిన సీఎం