అక్రమాస్తుల కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి... కచ్చితంగా హాజరు కావాలని ఈ నెల 24న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాజరవుతారా లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా పడింది. ఈ రోజు విచారణకైనా మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. తమ వద్ద పిటిషన్ పెండింగులో ఉందని.. సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చని హైకోర్టు జగన్ తరఫు న్యాయవాదులకు ఇటీవల సూచించింది.
ఇవాళ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
సీబీఐ, ఈడీ కోర్టులో నేడు సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరగనుంది. సీబీఐ 11 చార్జిషీట్లు.. ఈడీ 5 అభియోగ పత్రాలపై విచారణ ఉంది.
cm jagan illegal assets cases inquiry today