ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Meeting with EMPLOYEES: ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ చర్చలు.. డిమాండ్ల పరిష్కారంపై సర్వత్రా ఉత్కంఠ - cmjagan news

ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ చర్చలు
ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ చర్చలు

By

Published : Jan 6, 2022, 1:06 PM IST

Updated : Jan 6, 2022, 3:25 PM IST

13:01 January 06

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

ముఖ్యమంత్రి జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్‌, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. వీటిలో ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్‌ చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా సంఘాల నేతలు సీఎంను కోరనున్నారు.

55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల సీఎస్‌ కమిటీ 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. తమకు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తేనే ఆమోదయోగ్యంగా ఉంటుందని స్పష్టం చేశాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ..ఉద్యోగులు వెనక్కితగ్గటం లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చదవండి

రాష్ట్రపతితో మోదీ భేటీ- పంజాబ్ పర్యటనలో​ భద్రతా లోపాలపై చర్చ

Last Updated : Jan 6, 2022, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details