CM Jagan on floods : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల్లో ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవల్సిన సహాయ చర్యలపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
వరద పెరిగే అవకాశం ఉంది: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న గోదావరి నదికి భారీగా వరద వస్తోందని.. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని.. అలాగే 13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోందని సీఎం జగన్ తెలిపారు. రేపు ఉదయానికి వరద మరింత పెరిగే అవకాశముందన్నారు. వందేళ్లలో ఇంత ముందుగా.. ఈ స్థాయిలో వరద ఎప్పుడు రాలేదన్నారు. సాధారణంగా ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది.. అయితే తొలిసారిగా జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందన్నారు.
వెంటనే సహాయక శిబిరాలు ఏర్పాటు చేయండి: ఎగువ నుంచి భారీ వరద ముంచెత్తున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకుండా చూసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే 24 గంటలు కంట్రోల్ రూంలు పనిచేయాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే శిబిరాల్లో ఆహారం, నీరు , ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు.అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తి ఉంటే రూ.1,000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వండి తక్షణ సహాయంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రోజువారీ నివేదికలు పంపండి: చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించాలని.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. సీఎంవో అధికారులు ఎల్లప్పుడూ.. అందుబాటులో ఉంటారన్నారు. వర్షాలు, వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి.. రోజువారీ నివేదికలు పంపించాలని కలెకర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: