కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులపై వినతి పత్రం అందించారని పేర్కొంది. లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఆదాయంపై తీవ్రప్రభావం పడిందని అమిత్ షాకు తెలిపారని స్పష్టం చేశారు.
అమిత్ షాకు సీఎం అందించిన వినతి పత్రంలో వివరాలివే! - అమిత్ షాకు అందించిన వినతి పత్రం వార్తలు
కేంద్రం హోంమంత్రి అమిత్ షా భేటీలో సీఎం జగన్ అందించిన వినతి పత్రం వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడిందని అమిత్ షాకు స్పష్టం చేసినట్లు తెలిపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం అందించాలని కోరారని పేర్కొంది.
cm jagan with amit sha
కేంద్రం నుంచి నిధులు తగ్గడం, కరోనా భారంతో ఖజానాపై తీవ్ర ప్రభావం పడిందని సీఎం జగన్ అమిత్ షాకు తెలిపారని వెల్లడించింది. రాష్ట్రానికి రూ. 3622.07 కోట్ల జీఎస్టీ పరిహారం రావాల్సి ఉందని వినతి పత్రంలో పేర్కొన్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
ఇదీ చదవండి :సీఎం జగన్కు ప్రధాని మోదీ అభినందన...ఎందుకంటే?