ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 9న భువనేశ్వర్ వెళ్లనున్నారు. జలవివాదాల పరిష్కారం కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న జల జగడం పరిష్కారం కోసం చర్చలు జరపనున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో చర్చలు జరపనున్నారు. ఆ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
CM Jagan Tour: జల వివాదాల పరిష్కారానికి.. ఈ నెల 9న భువనేశ్వర్‌కు సీఎం జగన్ - సీఎం జగన్ ఒడిశా పర్యటన
సీఎం జగన్ ఈ నెల 9న ఒడిశాలో పర్యటించనున్నారు. జల వివాదాల పరిష్కారం కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
![CM Jagan Tour: జల వివాదాల పరిష్కారానికి.. ఈ నెల 9న భువనేశ్వర్‌కు సీఎం జగన్ ఈ నెల 9న భువనేశ్వర్ వెళ్లనున్న సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13545084-711-13545084-1636014621121.jpg)
పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యలతో పాటు రెండు రాష్ట్రాల్లో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపకరించే నేరెడి బ్యారేజీ నిర్మాణంపై చర్చిస్తారు. చర్చల కోసం సమయం ఇస్తే వస్తానని ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన నవీన్ పట్నాయక్ చర్చలకు సానుకూలత వ్యక్తం చేస్తూ... రావాలని ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ చేయాలంటే ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లలో ముంపు సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ పరిస్ధితుల్లో నీటిని నిల్వ చేసేందుకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో వైఎస్ జగన్ చర్చలు జరుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: