ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ - cm jagan

కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో అమిత్‌షాతో జరిగే భేటీకి హాజరవుతారు.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమావేశానికి సీఎం జగన్

By

Published : Aug 26, 2019, 6:35 AM IST

Updated : Aug 26, 2019, 10:41 AM IST

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి దిల్లీ చేరుకున్నారు. 11 గంటలకు జరిగే కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమావేశంలో పాల్గొంటారు. వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్‌ షా చర్చించనున్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాలోచనలు జరుపుతారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కేరళ, బంగాల్‌, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

వెల్లంపల్లికి సీఎం పరామర్శ...

దిల్లీ వెళ్లే ముందు ముఖ్యమంత్రి జగన్... రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లారు. ఆయన తల్లి మహలక్ష్మమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని వెలంపల్లి నివాసానికి వెళ్లి... మంత్రి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చారు. మహలక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వెల్లంపల్లికి సీఎం పరామర్శ...

ఇదీ చదవండీ...బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల ఆందోళన

Last Updated : Aug 26, 2019, 10:41 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details