కేబినెట్ భేటీలో రాజధాని తరలింపుపై సీఎం జగన్.. మంత్రులకు అరగంటపాటు వివరించినట్లు సమాచారం. ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించినట్లు తెలుస్తోంది. లక్ష కోట్లలో 10 శాతం విశాఖకు ఖర్చు చేస్తే హైదరాబాద్ స్థాయి నగరం అవుతుందని సీఎం అన్నారు. రాజధాని మార్పు ఎందుకు, ఏమిటో ప్రజలకు చెప్పి చేద్దామని వ్యాఖ్యానించారు. రాజధానిపై వచ్చే నెల 4న ప్రకటన చేద్దామని కొందరు మంత్రులు జగన్కు సూచించగా.. హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రకటన చేద్దామని మరికొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. రాజధాని తరలింపుపై తొందరేమీ లేదని ముఖ్యమంత్రి జగన్ కేబినేట్ భేటీలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
'ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేం' - Ap cabinet news
మంత్రివర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్ అరగంట పాటు వివరించినట్లు తెలుస్తోంది. ఒకే ప్రాంతంలో లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. లక్ష కోట్లలో 10 శాతం విశాఖకు ఖర్చు చేస్తే హైదరాబాద్ వంటి మహానగరం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం.
సీఎం జగన్