ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రామ సచివాలయాల్లో డేటా క్రోడీకరణకు కార్యాచరణ సిద్ధం చేయండి: సీఎం

ప్రణాళిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గ్రామ సచివాలయ డేటా క్రోడీకరణ బాధ్యతలను డిజిటల్ అసిస్టెంట్​కు అప్పగించాలని ఆదేశించారు. సుస్థిర సమగ్రాభివృద్ధికి ఐరాస నిర్దేశించిన లక్ష్యాల అమలుకు తగిన సాయం తీసుకోవాలని సూచించారు.

ప్రణాళిక శాఖపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ సీఎం జగన్

By

Published : Feb 22, 2021, 5:47 PM IST

గ్రామ సచివాలయ డేటా క్రోడీకరణ పనిని ప్రత్యేకంగా ఒకరికి అప్పగించాలని సీఎం జగన్ సూచించారు. ఈ పనిని గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌కు అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. డేటా క్రోడీకరణను మండల స్థాయి ఉద్యోగి పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆర్బీకేల పరిధిలోని ఈ–క్రాపింగ్‌ డేటానూ కూడా తీసుకోవాలని చెప్పారు. డేటా సేకరణే కాదు, కార్యాచరణపైనా దృష్టి సారించాలన్నారు. మెరుగైన సేవలందించిన వాలంటీర్లకు ఉగాది రోజు సత్కారం చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

సుస్థిర సమగ్రాభివృద్ధికి ఐరాస 17 లక్ష్యాలు నిర్దేశించిందని సీఎంకు అధికారులు తెలిపారు. 17 లక్ష్యాలు అందుకునేలా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ విషయంలో లక్ష్య సాధనకు ఐరాస, అనుబంధ విభాగాల సాయం తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోతో కలిసి పని చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details