ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మధ్యాహ్నం దిల్లీకి సీఎం.. రాత్రి 10 గంటలకు అమిత్‌ షాతో భేటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు మధ్యాహ్నం దిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులను కలుస్తారు. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

By

Published : Jan 19, 2021, 12:05 PM IST

cm jagan delhi tour
cm jagan delhi tour

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు. ‌రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను జగన్ కలవనున్నారు.

విభజన హామీలు, పోలవరం పెండింగ్‌ నిధులపై చర్చించే అవకాశం ఉంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని సీఎం కోరే అవకాశం ఉంది. హైకోర్టును కర్నూలుకు తరలించే‌ ప్రక్రియ ఆరంభించాలని మరోమారు అమిత్ షాను కోరనున్నట్లు తెలిసింది.

ఉగాది నాటికి విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటిలోపు న్యాయస్థానాల్లోనూ విచారణ పూర్తవుతుందని అంచనా వేస్తోంది. ఈలోపు కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. అలాగే విభజన చట్టంలోని పలు అంశాల పరిష్కారం, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులపై హోంమంత్రితో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్​ టెన్షన్​

ABOUT THE AUTHOR

...view details