ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హస్తినలోనే సీఎం జగన్...అమిత్​ షాతో భేటీకి అవకాశం!

ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. మంగళవారం కూడా సీఎం దిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది.

దిల్లీలోనే సీఎం జగన్... రేపు పలువురు మంత్రులలో భేటీ అవకాశం

By

Published : Oct 21, 2019, 11:47 PM IST

Updated : Oct 22, 2019, 7:10 AM IST

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. అమిత్‌షాతో నిన్ననే భేటీ కావాల్సి ఉన్నా...మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల సందర్భంగా ఆయా ఎన్నికల తీరు పరిశీలనతోపాటు, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలతో అమిత్‌షా తీరిక లేకుండా ఉండటంతో సీఎం ఆయన్ను కలవలేకపోయారు. రాత్రి 10 గంటల వరకు ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం ఎదురుచూశారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో దిల్లీ వచ్చినప్పుడూ అమిత్‌షాను కలవాల్సి ఉన్నా కుదరలేదు. నేడు హోంమంత్రితోపాటు న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తోనూ సీఎం భేటీకానున్నారు. కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై జగన్ పార్టీ ఎంపీలతో చర్చించారు. అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం జగన్ రోజంతా ఎదురుచూసినా వీలుపడలేదు కానీ...తెలంగాణకు చెందిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మాత్రం తాను కేంద్రహోంమంత్రితో 15 నిమిషాలపాటు భేటీ అయినట్లు తెలపడం విశేషం.

Last Updated : Oct 22, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details