ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2020 నుంచి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం వద్దు! - ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు

ఇకపై భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

cm jagan decision on govt jobs

By

Published : Oct 17, 2019, 3:23 PM IST

Updated : Oct 17, 2019, 3:36 PM IST

2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్.. ఉన్నతాధికారులను ఆదేశించారు. పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునే ఆలోచన ఉందని సీఎం తెలిపారు. అత్యవసర సర్వీసుల విభాగాల పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులతో ముఖ్యమంత్రి చెప్పారు. ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Oct 17, 2019, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details