'ఆ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం నిర్ణయం' - declare probation for village and ward secretariat employees
17:03 June 16
డిపార్ట్‌మెంటల్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికే ప్రొబేషన్ డిక్లరేషన్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రొబేషన్ డిక్లేర్ దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. డిపార్ట్‌మెంటల్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికే ప్రొబేషన్ డిక్లేర్ చేయనున్నారు. ప్రొబేషన్ ఇచ్చే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.
ప్రొబేషన్ డిక్లేర్ చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. జులై 1నుంచి ఉద్యోగులకు పీఆర్‌సీ వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు సమాచారం.
ఇదీ చదవండి: