ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం మొదటి ర్యాంకులో నిలిచినందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ఆ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఏపీఈడీబీ, సీఈఓ జేవిఎన్ సుబ్రమణ్యంలను సీఎం అభినందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను మంత్రి సహా ఉన్నతాధికారులు కలిశారు. పరిశ్రమల శాఖలో అత్యుత్తమ విధానాలు సమర్థంగా అమలు చేస్తున్నారని ప్రశంసించిన ముఖ్యమంత్రి జగన్.. అదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు.
పరిశ్రమల శాఖకు సీఎం జగన్ అభినందనలు - cm jagan congratulates to Department of Industries
సులభతర వాణిజ్యంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సహా ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
mekapati goutham reddy