ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాంవిలాస్ పాసవాన్​ మృతి పట్ల ప్రముఖుల సంతాపం - రాం విలాస్ పాసవాన్ మృతి వార్తలు

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, చంద్రబాబు, పవన్​ సంతాపం తెలిపారు.

రాంవిలాస్ పాసవాన్​
రాంవిలాస్ పాసవాన్​

By

Published : Oct 8, 2020, 10:35 PM IST

Updated : Oct 8, 2020, 11:05 PM IST

గవర్నర్ సంతాపం

కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ సంతాపం తెలిపారు. పాసవాన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని గవర్నర్ అన్నారు.

అణగారిన వర్గాల గొంతుక పాసవాన్​

కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా ఎస్సీ నేతగా ప్రజా జీవితంలో గడిపారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాల గొంతుకగా పాసవాన్‌ నిలిచారన్నారు. పాసవాన్‌ కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నిస్వార్థ సేవను దేశం కోల్పోయింది

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్​ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సంతాపం ప్రకటించారు. పాసవాన్ మరణ వార్త ఎంతో బాధ కలిగించిందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఆయన నిస్వార్థ సేవను దేశం కోల్పోయిందని చంద్రబాబు తెలిపారు. పాసవాన్ మరణం భారత రాజకీయాలకు తీరని లోటని నారా లోకేశ్ అన్నారు. పాసవాన్​ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు

రాంవిలాస్‌ పాసవాన్‌ మృతిపట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం తపించిన నాయకులు రాంవిలాస్ పాసవాన్‌ అని పవన్ అన్నారు. పాసవాన్‌ మృతి బడుగు బలహీన వర్గాలకు తీరని లోటన్నారు. పాసవాన్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి : కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్​ అస్తమయం

Last Updated : Oct 8, 2020, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details