మాజీ అటార్నీ జనరల్, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సోలిసిటర్ జనరల్ సోలి సోరబ్జీ కన్నుమూయడంపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం సోరబ్జీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. హేగ్‌లోని పర్మనెంట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్.. పీసీఏలో పని చేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసి విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన సేవలకు పద్మ విభూషణ్‌ను ప్రదానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సోరబ్జీ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
'హక్కుల పరిరక్షణ కోసం సోరబ్జీ ఎంతో కృషి చేశారు' - former attorney general soli sorabjee passes away
సోలిసిటర్ జనరల్ సోలి సోరబ్జీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మానవ హక్కుల పరిరక్షణ కోసం సోరబ్జీ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ap cm jagan